ఆర్బీఓఎల్‌లో ఆనందాల దీపావళీ..!
– కొత్త దుస్తుల పంపిణీ చేసిన శ్రీనివాస్ రెడ్డి
– శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు
– పాల్గొన్న ఎండీ సరళా శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండల పరిధిలోని ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీలో దీపావళీ సంబరాలు ఆనందాల మద్య జరిగాయి. ఫ్యాక్టరీ సీఈఓ, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఎండీ సరళా రెడ్డిల ఆధ్వర్యంలో ప్రతి యేడాది మాదిరిగానే ఉత్సవాలు జరిగాయి. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దాదాపు 400ల మంది ఉద్యోగులు, సిబ్బందికి కొత్త దుస్తువులను పంపిణీ చేసే సంప్రదాయం కొనసాగుతోంది.
ఈ యేడాది కూడా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి సీఈఓ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కొత్త దుస్తులతో పాటు స్వీటు ప్యాకెట్లను పంపిణీ చేశారు. దీంతో ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఆనందోత్సవాల మద్య దీపావళీ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ సరళారెడ్డితో పాటు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

