ఉత్సాహంగా పరీక్షలు రాయండి

కెరీర్ తాండూరు వికారాబాద్

ఉత్సాహంగా పరీక్షలు రాయండి

– విద్యార్థులు ఒత్తిడికి గురి కావొద్దు 

– మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు

తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉత్సాహంగా పరీక్షలు రాయాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు పేర్కొన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని వి.వి.ఎచ్.ఎస్, సేయింట్ మార్క్స్, కేరళ మెడల్ పాఠశాలలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో రూపందించిన ప్రత్యేక పరీక్ష ప్యాడ్లను, పెన్స్,పెన్సిల్స్ తదితర పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా కష్టపడి చదవాలన్నారు. ప్రతిఒక్కరు విద్యలో రాణించడమే కాకుండా ఉన్నత శిఖరాలు అధిరోహించలని అన్నారు. పరీక్షలు ఉత్సాహంగా.. ఒత్తిడి లేకుండా రాయాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు ఉపాద్యాయులకు పెరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షులు నయీమ్, కౌన్సిలర్లు మంకల్ రాఘవేందర్, భీం సింగ్, ముక్తర్ నాజ్, స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవ్ రావు, తెరాస పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, నాయకులు గుండప్ప, బాలకృష్ణ రెడ్డి, బస్వరాజ్, ఇంతియాజ్ బాబా, చంటి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.