రక్తదాతల సామాజిక స్పూర్తి
– స్వచ్ఛందంగా రక్తదానం చేసిన యువకులు
– జైభవానీ యూత్ సభ్యులకు అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : జాతీయ రక్తదాన దినోత్సవం సందర్బంగా తాండూరుకు చెందిన జై భవానీ యూత్ సభ్యులు సామాజిక స్పూర్తిని చాటుకున్నారు. బుధవారం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో యూత్ సభ్యులు మీదిపేట వినోద్ కుమార్, మరో సభ్యుడితో కలిసి రక్తదానం చేశారు.

చాలా ఏండ్ల నుంచి జై భవాని యూత్ సభ్యులు రక్తదానం చేస్తూ ఆపద ఎంతోమందికి ప్రాణదానం చేశారు. జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా మరోసారి రక్తదానం చేసి సామాజిక స్పూర్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం మహాదానం అన్నారు. రక్తదానంతో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. ఎవరైనా రక్తదానం కోసం ఇబ్బందులు పడితే తమ యూత్ సంఘాన్ని సందప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి రక్తనిధి కేంద్రం వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

