కొలువుల సాధనకు సిద్దంకండి
– ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం తోడ్పాటు
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల
– ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: జిల్లాలోని నిరుద్యోగ యువత పోలీసు కొలువుల సాధనకు సిద్దంగా ఉండాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో ఎస్సి, ఎస్టీ విరుద్యోగ యువతకు సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తరువాత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80 వేల ఉద్యాగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగవకాశాలు కల్పిస్తుందన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు సంబంధిత శాఖల పరంగా ఉచిత శిక్షణను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పోలీస్ శాఖలోనే 40 నేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నట్లు కలెక్టర్ అన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అధ్యాపకులు, నివాసం, భోజనంతో పాటు రూ. 2 వేల స్టడీ మెటీరియల్ ను కూడా అందచేయడం జరుగుతుందని అన్నారు. శిక్షణ పొందిన అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి మీ తల్లి దండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు కృషి తీసుకున్న పోలీస్ శాఖను కలెక్టర్ అభినందించారు. అనంతరం
వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి మాట్లాడుతూ ఆపోహలకు తావు లేకుండా ఆత్మ విశ్వాసంతో చదువుతూ ముందుకు సాగాలని అన్నారు. పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాందించాలంటే కృషి, పట్టుదల చాల అవసరమని అన్నారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డుకాదని, నిరాశ చెందకుండా కృషి చేయాలని సూచించారు. రెగ్యులర్ చదువులకు, పోటీ పరీక్షలకు ఎంతగానో తేడా ఉంటుందని దానికనుగుణంగా చదుకోవాలని అన్నారు. అందరూ క్రమశిక్షణతో, కష్టపడి మీ తల్లి తండ్రులు కంటున్న కళలను సహకారం చేయాలన్నారు. పోలీసు కొలువు సాకారం చేసేందుకు అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ తీసుకుంటున్న అభ్యర్ధులకు కావలసిన స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి మల్లేశం, జిల్లా ట్రైబల్ అభివృద్ధి అధికారి కోటాజీ, DTC అదనపు ఎస్‌పి మురళీధరన్, డిఎస్‌పి విజయ్ కుమార్, మల్లేశం DSWO, ఏఆర్ డిఎస్‌పి సత్యనారాయణ, RI’s CI’s మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.


