రైతులకు శుభవార్త
– ధరణిలో కొత్త సదుపాయం
– పాసు పుస్తకంలో మార్పులకు అవకాశం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్‌లో తలెత్తున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటూనే ఉంది. ధరణి పోర్టల్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు శుభవార్త తెలిపింది. తాజాగా ధరణి పోర్టల్‌లో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసువచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త సదుపాయంలో పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పు, ఒప్పులను సరిదిద్దుకోవడం, వివరాల్లో మార్పులకు చేర్పులకు అవకాశం కల్పించింది. మరో మాడ్యూల్ ప్రకారం పాసుపుస్తకంలోని ఎనిమిది రకాల వివరాలకు మార్చుకునే వెసులుబాటు కల్పించింది. పేరు, నేల స్వభావం, భూ వర్గీకరణ, భూమి రకం, విస్తీర్ణం, సర్వే నెంబర్, నోషనల్ ఖాతా నుంచి పట్టాభూమికి బదిలీ చేయడం, భూమి అనుభవంలో మార్పు వంటి వివరాలను సరిచేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.


