దేశం, తల్లిదండ్రులపై ప్రేమను పెంచుకోవాలి
– సెయింట్ మేరిస్ హైసూల్లో ఇన్వెస్టిటూర్ వేడుక
– ఉత్తమ విద్యార్థులకు అవార్డుల ప్రధానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థి దశ నుంచే దేశం, తల్లిదండ్రులు, గురువులపై ప్రేమను పెంపొందించుకోవాలని తాండూరు పీపుల్స్ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ కోస్గి తిప్పయ్య అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో ఇన్వేస్టిట్యూర్ (పట్టాభిషేకం) వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ ప్రిన్సిపల్ కోస్గి తిప్పయ్య మాట్లాడుతూ విద్యార్థులు దేశం, తల్లిదండ్రులు, గురువులపై ప్రేమను పెంచుకోవాలన్నారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొ వాలన్నారు. మరోవైపు పాఠశాలలో సొర్వ్ సోసైటీ ఆధ్వర్యంలో గత ఎనిమిదేళ్లుగా కొనసాగిస్తున్న ఆదర్శ్ జాన్సన్ ఔట్ స్టాంటిండ్ అవార్డులను ఈ వేడుకలో విద్యార్థులకు అందజేశారు. 2019 నుంచి 2022 వరకు విద్యాసంవత్సరంలో పదో తరగతిలో 10పాయింట్లు సాధించిన ఉత్తమ విద్యార్థులకు ఈ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.



