ఆసుపత్రిలో వదిలేసి వెళ్లారు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆసుపత్రిలో వదిలేసి వెళ్లారు..!
– వారం తరువాత వ్యక్తి మృతి
– అనాథ మృతదేహంగా మార్చురికి
– తప్పుడు చిరునామాతో లభించని అసలైన ఆచూకీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆరోగ్యం బాగాలేదని ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు ఆసుపత్రిలో చేర్పించి వెళ్లిపోయారు. వారం రోజుల తరువాత అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మృతిచెందాడు. ఆసుపత్రిలో చేర్పించే సమయంలో తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల మృతుడిని వివరాలు తెలియరావడం లేదు. దీంతో అతని మృతదేహంలో ఆసుపత్రి మార్చురికి అనాథగా పడిఉంది. ఈసంఘటన తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈనెల 3వ తేది మధ్యాహ్నం సుమారు 40 ఏండ్లు ఉన్న రాములు అనే వ్యక్తిని తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అతని తండ్రి పేరు వెంకటప్ప, మద్దూరుకు చెందిన వ్యక్తిగా గుర్తుతెలియని వ్యక్తులు నమోదు చేయించారు. రికార్డులో సెల్‌: 8374363245కూడ నమోదు చేయించారు. అయితే ఈనెల 9వ తేదిన ఆసుపత్రిలో చేరిన రాములు అనారోగ్యంతో మరణించాడు. ఆసుపత్రి సిబ్బంది నమోదు చేయించిన సెల్ ఫోన్‌కు ఫోన్ చేస్తే రాంగ్‌ నెంబర్ అని తెలింది.

చేసేదేమిలేక రాములు మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆసుపత్రి వైద్యులు తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదికూడా చదవండి..

ఆసుపత్రిలో చేరిన ఏఎంసీ చైర్మన్