నృత్యం ఎంతో ప్రాధ‌న్య‌మైన‌ది

ఆరోగ్యం క్రీడలు తాండూరు వికారాబాద్

నృత్యం ఎంతో ప్రాధ‌న్య‌మైన‌ది
– స్వస్తిక్ ఆర్ట్స్ అకాడమీలో అంత‌ర్జాతీయ నృత్య దినోత్స‌వం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: స‌మాజంలో నృత్యం ఎంతో ప్రాధాన్య‌మైన‌ద‌ని తాండూరు నృత్య క‌ళ‌కారులు పేర్కొన్నారు. శుక్ర‌వారం అంత‌ర్జాతీయ నృత్య దినోత్స‌వం ఘ‌నంగా జ‌రుపుకున్నారు. తాండూరులోని శ్రీ స్వ‌స్తిక్ ఆర్ట్స్ అకాడ‌మి ఆధ్వ‌ర్యంలో సంబ‌రాల‌ను చేసుకున్నారు. నృత్య దినోత్స‌వం సంద‌ర్భంగా కేక్ ను క‌ట్ చేసి పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా అకాడ‌మి అధ్య‌క్షులు ర‌మేష్ మాస్ట‌ర్ మాట్లాడుతూ స‌మాజంలో నృత్య క‌ళ‌ల‌కు ఎంతో ప్రాధాన్య‌ముంద‌న్నారు. నృత్యంతో మాన‌వ జీవనంలో ఎన్నో మార్పుల‌ను తీసుక‌వ‌స్తుంద‌న్నారు. మారుతున్న కాలంలో పుట్టుక‌వ‌స్తున్న కొత్త నృత్య విధానాల వ‌ల్ల చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు మ‌నిషి సంపూర్ణ ఆరోగ్యానికి కూడ దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. నృత్య క‌ళ‌ను గౌర‌వించ‌డం అంద‌రి బాధ్య‌త అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నృత్య క‌ళాకారులు హ‌న్మంతు, కాశి, చిన్నారులు పాల్గొన్నారు.