కంపుకే ప్రాణాలు పోయేలా ఉన్నాయ్..!
– ఊపిరాడనంత కాలుష్యం, దుర్గందం
– జిప్సం కర్మాగారాన్ని మూసేయండి
– గిరిజనుల ఆగ్రహం
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: కంపుకే ప్రాణాలు పోయేలా ఉన్నాయి.. కాలుష్యం దుర్గందాన్ని వెదజల్లుతున్న కర్మాగారాన్ని మూసేయాలంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అంతారం శివారు, గొట్టపల్లి అటవి ప్రాంతం, కందనెల్లి తాండా సమీపంలో ఓ జిప్సం కర్మాగారం కొనసాగుతుంది.
గత కొన్నేళ్ల నుంచి ఈ కర్మాగారం నుంచి కాలుష్యంతో పాటు భరించలేనంత దుర్గందాన్ని వెదజల్లుతోంది. ఉండబట్టలేక శుక్రవారం కందనెల్లి తాండాకు చెందిన గిరిజనులు కర్మాగారాన్ని మూసేయాలంటూ ఆందోళనకు దిగారు. ప్రతి రోజూ సాయంత్రం నుంచి తెల్లవారు జాము వరకు దుర్వాసన వెదజల్లడంతో ఊపిరాకుండా పోతోందని ఆవేధన వ్యక్తం చేశారు. కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయని వాపోయారు. అంతేకాకుండా సమీప ప్రాంతాల చెరువులు, పంట పొలాలు నాశనమవుతున్నాయన్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే జిప్సం కర్మాగారాన్ని మూసి వేసి ప్రాణాలను కాడాపాలని కోరుతున్నారు. తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు.

