రేపు పెద్దేముల్ మండలంలో విద్యుత్ అంతరాయం
– ప్రకటించిన విద్యుత్ అధికారులు
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: పెద్దేముల్ మండలంలో రేపు విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు మండల విద్యుత్ అధికారి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని తట్టెపల్లి, గాజీపూర్, ఇందూరు సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం 8గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని వెల్లడించారు. విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

