రాయల్టీ భారం తగ్గించండి
– మంత్రి సబితారెడ్డిని కోరిన తాండూరు వ్యాపారులు
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో కలిసిన వ్యాపారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: నాపరాతి వ్యాపారంలో రాయల్టీ భారం తగ్గించేలా చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి తాండూరు వ్యాపారులు కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో తాండూరు స్టోన్, క్వారీ అసోసియేషన్ సభ్యులు మంత్రి సబితారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాయల్టీ ధరలు పెంచడం వల్ల తాండూరు వ్యాపారులపై రూ .1500ల నుంచి 2 వేల వరకు భారం పడుతుందని మంత్రి సబితారెడ్డి దృష్టికి తెచ్చారు. ఈ భారాన్ని తగ్గించేలా చూడాలని, స్లాబ్ రాయల్టీని కూడ తగ్గించాలని వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన మంత్రి సబితారెడ్డి అతి త్వరలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టి కి తీసుకెళ్లి నాపరాతి వ్యాపారుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో తాండూరు స్టోన్ మర్చంట్ అధ్యక్షులు అఫ్పూ(నయూం), ఉపాధ్యక్షులు అబ్దుల్ సమద్, ప్రధాన కార్యదర్శి ఫైయజ్ బైగ్, తాండూరు క్వారీ ఓనర్స్ అసోసియేషన్ ఇంచార్జి అధ్యక్షులు భాగబాన్ కరీం, ప్రధాన కార్యదర్శి వెంకట్ రాం రెడ్డి, కోశాధికారి మన్సూర్ పాషా, జాయింట్ కార్యదర్శి జుబేర్ లాలా తదితరులు ఉన్నారు.

