గో మయ ప్రమిదలు పవిత్రం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గో మయ ప్రమిదలు పవిత్రం..!
– పర్యావరణానికి మేలు
– దీపావళికి వాటిని వెలిగిద్దాం
తాండూరు, దర్శిని ప్రతినిధి : దీపావళి పండగకు అందరు సిద్దమవుతున్నారు. ఈ పండగ అంటేనే అందరికి గుర్తుకొచ్చేది దీపాల వెలుగులే. ఇంటింటా దీపాలను వెలగించి వెలుగుల్లో పండగను జరుపుకున్నారు. అయితే దీపావళీ పండగ రోజు వివిధ రకాలైన దివ్వెలను తీసువచ్చి వెలిగిస్తారు. ఇందులో కొన్ని కాలుష్య కారాకాలు కూడ ఉంటాయి. దీపావళీ పర్వదినాన గో మయంతో తయారు చేసిన దీపాలు వెలిగించడం మంచిదని పండితులు పేర్కొంటున్నారు. గో మయంతో తయారు చేసిన దీపాలు ఎంతో ప్రవిత్రమైనవని చెబుతున్నారు. దేశీయ ఆవు పేడతో తయారు చేసిన గో మయ ప్రమిదలతో పర్యావరణానికి ఎలాంటి హాని చేయవని నిపుణులు సైతం పేర్కొంటున్నారు. గో మయ ప్రమిదలతో గాలి, నీరు, భూమి కాలుష్యం కావడం జరగదని స్పష్టం చేస్తున్నారు.


గో మయ ప్రమిదలను వెలగిద్దాం: కోట్రిక విజయలక్ష్మీ, మాజీ చైర్ పర్సన్

పవిత్రమైన గో మయ ప్రమిదలతో దీపావళీ పండగను జరుపుకోవం శ్రేష్ఠం. స్వచ్చమైన గో మయంతో తయారు చేసిన లక్ష్మీ ప్రమిదలను వెలిగించి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. దీపావళి తరువాత ఈ ప్రమిదలు చెట్లకు, పొలాలకు ఎరువుగా ఉపయోగతాయి.