ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌తో పెట్రోల్‌

కెరీర్ జాతీయం టెక్నాలజీ తెలంగాణ

ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌తో పెట్రోల్‌
– అబ్బుర ప‌రుస్తున్న యువ‌కుడి ప్ర‌తిభ‌
– సోష‌ల్ మీడీయాలో వైర‌ల్
ద‌ర్శిని డెస్క్‌: భిన్నమైన ఆలోచన, తాను చేయాలన్న పనిపై పూర్తి అవగాహన పట్టుదల ఉంటే చదువుతో పనిలేదని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. ప‌ర్యావ‌ర‌ణానికి పెనుభూతంగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాల‌తో పెట్రోల్‌ను త‌యారు చేసి అంద‌రిని అబ్బుర ప‌రుస్తున్నాడు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఒడిశాకు చెందిన అజ‌య్ క‌థే ఇది. ఇక వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్ద సమస్య వాతావరణ కాలుష్యం అయితే.. అందులో ముఖ్యంగా ప్లాస్టిక్‌( Plastic) కారకాలు ఒకటి. ఆధునిక సమయంలో మనిషి జీవితంలో ప్లాస్టిక్ వాడకం ముఖ్యభాగమైపోయింది. తాగే నీరు, తిన తిండి. అన్నిటికి ప్లాస్టిక్ వస్తువులనే ఉపయోగిస్తున్నాం. ఈ ప్లాస్టిక్ భూమిలో ఇంకదు.. నీటిలో కరగదు. అంతేకాదు.. ప్లాస్టిక్ లో నిల్వ చేసిన ఆహారం అనారోగ్య కారకం.. ఇలా ముత్తానికి ప్లాస్టిక్ మానవాళికి ఓ సెను భూతంగా మారిపోయింది. అయితే ఒడిశాలోని రాధాదరణ్ పూర్ కు చెందిన అజయ్ పాలీథీన్, ప్లాస్టిక్ బాటిళ్ల వ్యర్ధాలకు అర్ధం కలిపిస్తూ సరికొత్త ప్రయత్నం చేశాడు. పాలిథీన్, ప్లాస్టిక్ బాటిళ్లతో పెట్రోల్, గ్యాస్ ను( Petrol from Polythene) తయారు చేస్తూ.. అందరికి షాక్ ఇచ్చాడు. అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి నాణ్యమైన ముడి చమురుని తయారు చేస్తున్నాడు. నిజానికి అజయ్ చదివింది ఏడో తరగతి మాత్రమే.. అయితే భూమి మీద చెత్తగా పేరుకుంటూ.. భారంగా మారిన ప్లాస్టిక్, పాలిథీన్ వంటి వస్తువులతో పెట్రోల్ ని తయారు చేస్తున్నాడు. రోజుకు రోజుకు 12 నుంచి 13 కేజీల పాలిథీన్ ను సేకరించి.. వీటి సాయంతో సుమారు 7-8 లీటర్ల పెట్రోల్ను తయారుచేస్తున్నాడు. ఇలా పెట్రోల్ తయారు చేయడం కోసం పెట్టుబడి పెట్టడానికి తన టైకు రూ.80 వేలకు అమ్మేశాడు. మరికొంత‌ సొమ్ముని.. స్నేహితుల వద్ద అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బుతో ప్లాస్టిక్ తో పెట్రోల్ తయారు చేసే యంత్రాన్ని కొనుగోలు చేశాడు. పాలిథీన్, వాటర్ బాటిళ్లను నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద మండించి పెట్రోలు తయారు చేస్తున్నాడు. ఒక కేజీ పాలిథీన్‌ 600 గ్రాముల పెట్రోల్ తయారవుతుందని చెప్పాడు. ఇలా తయారు చేసిన లీటరు పెట్రోల్లో బైక్ పై 50 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని చెబుతున్నాడు. ప్రభుత్వం సాయం చేస్తే మరిన్ని పరిశోధనలు చేసి.. తక్కువ ధరక పెట్రోల్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చేలా చేస్తానని చెబుతున్నాడు అజయ్.
వివ‌రాల కోసం ఈ కింది వీడియోను చూడండి.