సినిమా పోస్టర్ రేపిన కల్లోలం.!
– ఎఫ్ఐఆర్ పోస్టర్‌పై మతపర వాక్యాలు
– తొలగించాలని వర్గం నాయకులు పట్టు
– నిర్మాత, డైరెక్టర్, థియేటర్ యజమానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్
– జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించిన ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు విడుదల అవుతున్న ఓ సినిమా పోస్టర్ తాండూరులో కల్లోలం సృష్టించింది. పోస్టర్‌పై మతపరమైన వాక్యాలను ముద్రించారని, వివాదాదస్పద పదాలను కూడా ప్రచురించారని ఓ వర్గానికి చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా నిర్మాత, డైరెక్టర్‌తో పాటు తాండూరులోని సినిమా థియేటర్ యజమానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం తాండూరులో ఈ సంఘటన చోటు చే సుకుంది. తాండూరు పట్టణంలోని శాంత్ మహాల్ థియేటర్లో రేపు ఎఫ్ఐఆర్ అనే సినిమా విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్లను పురవీధుల్లో అంటించారు. ఈ పోస్టర్లపై ఓ మతానానికి సంబంధించి వాక్యాలు, వివాదాస్పద పదాలను కనిపించడంతో వర్గానికి చెందిన నేతలు మండిపడ్డారు. పట్టణంలోని శాంత్ మహాల్ థియేటర్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సినిమా పోసర్లను వర్గంకు చెందిన ప్రజలుకు, యువకులు చించేశారు. పట్టణంలోనే ఉన్న పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డిలు ఆందోళన కారులను చెదరగొట్టారు. కొద్ది సేపటి తరువాత తాండూరు డిఎస్సీ కార్యాలయానికి జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వర్గం ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

అక్కడ తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఎస్పీతో మాట్లాడారు. పోస్టర్ పై మతపరమైన వాక్యాలను తొలగించాలని, వివాదాస్పద పదాలను కూడ తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, పెద్దలు హాది, బాబర్, అఫ్పూ(నయూం), కమల్ అతహార్, యూసుఫ్ ఖాన్, షల్లూ, మస్తఫా పటేల్, ఇంతియాజ్ తదితరులు ఉన్నారు.

