చిన్నారిని పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ మండలానికి చెందిన సీనీయర్ జర్నలిస్టు పాండు కుమార్తెను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. పాండు కుమార్తె తన్విక ఇటీవలే అనారోగ్యానికి గురైంది. తాండూరు పట్టణంలోని శివ నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొంది ఇంటికి వచ్చింది. శనివారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి జర్నలిస్టు పాండు నివాసానికి చేరుకున్నారు. అనారోగ్యానికి గురైన తన్విక ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, పెద్దేముల్ సొసైటీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్ రెడ్డి, సర్పంచ్ హైదర్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

