ఆధార్ సెంటర్‌ను వెంటనే తెరవాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆధార్ సెంటర్‌ను వెంటనే తెరవాలి
– సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఆధార్ లబ్దిదారులకు కేంద్రాల నిర్వహకులు ఇబ్బందులు కలిగిచరాదని సీపీఎం వికారాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాస్ అన్నారు. తాండూరు పట్టణంలోని పోస్టాఫీసులో ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రం మూసివేతపై బుధవారం తాండూరు పట్టణంలోని పోస్టాఫీసు వద్ద నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, ఇతర ప్రయోజనాలతో పాటు ఆధార్ కార్డులలో తప్పుఒప్పులను సరిచేసుకునే సేవలను పొందేందుకు ప్రజలు ప్రజలు కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. మీ సేవలో ఆధార్ కార్డుల సేవ‌లను ఆస‌రాగా చేసుకుని ప్ర‌జ‌లను దోపిడి చేస్తున్నాయని ఆరోపించారు. పారదర్శకంగా సేవలందించేందుకు పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన‌ కేంద్రాన్ని చీటికి మాటికి మూసివేసి ఇబ్బందు పెట్టడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా మూసిన కేంద్రాన్ని తెరవాలని డిమాండ్ చేశారు. లేదంటే పోస్టాఫీసు ముందు నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్లేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.