పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలి
– పారిశుద్ధ్యం బాధ్యత సర్పంచులదే
– సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పల్లెలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సర్పంచులదేనని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలం నీళ్లపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్వయంగా పిచ్చి మొక్కల నివారణకు మందును పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పాటించాలన్నారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సర్పంచులదేని అన్నారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల అభవృద్ధికి ప్రజల సహకారం కూడా అవసరమని పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి పరామర్శ
———————————————
మరోవైపు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నీళ్లపల్లిలో పర్యటన ముగిసిన తరువాత సమీపంలోని జలాల్పూర్లో టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుర్వ గోవింద్ మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి, గ్రామ సర్పంచు, నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

