రైతులు ఆధైర్య ప‌డొద్దు..!

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

రైతులు ఆధైర్య ప‌డొద్దు..!
– త‌డిసిన ధాన్యం స‌ర్కారే కొంటుంది
– ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: వ‌డ్లు పండించిన రైతులు ఆధైర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, త‌డిసిన ధాన్యాన్ని స‌ర్కారే కొనుగోలు చేస్తుంద‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాండూరు మండలంలోని గొనుర్ గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి paరిశీలించారు. కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి కొనుగోళ్లపై ఆరా తీశారు. రైతులను పలకరించి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం విషయంలో కేంద్రం మోసం చేస్తే సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలుకు ముందుకొచ్చారని అన్నారు. తడిసిన ధాన్యంపై రైతులు అధైర్య పడాల్సిన పనిలేదని, తడిసిన దాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ వెంట డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రావూఫ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సాయి పూర్ బాల్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్లు సురేందర్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, అగ్గనూర్ సర్పంచ్ భీమప్ప, నాయకులు, రైతులు తదితరులు ఉన్నారు.