రోగిని పరామర్శించిన అబ్దుల్ రజాక్
– మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ రోగిని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్, 29వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ అబ్దుల్ రజాక్ పరామర్శించారు. మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఇమామ్‌బీ అనారోగ్యానికి గురై జిల్లా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాలనీ కౌన్సిలర్ వెంకన్నగౌడ్ ద్వారా విషయం తెలుసుకున్న అబ్దుల్ రజాక్ ఆసుపత్రికి చేరుకుని ఆమెను పరామర్శించారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.
