తాండూరు డీఎస్పీతో బీజేపీ నాయకుల భేటి
– సన్మానించిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నూతన ఢీఎస్పీ జీ.శేఖర్ గౌడ్‌తో బీజేపీ నాయకులు భేటి అయ్యారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన డీఎస్పీ లక్ష్మీనారాయణ హైదరాబాద్ హెడ్ ఆఫీసుకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో కొత్త డీఎస్పీగా శేఖర్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శుక్రవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి. యు.రమేష్ కుమార్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, పార్టీ నాయకులు డీఎస్పీ శేఖర్ గౌడ్‌ను కలిసి స్వాగతం తెలిపారు. అనంతరం శాలువాలతో కలిసి డీఎస్పీని సన్మానించారు. అనంతరం నాయకులు డీఎస్పీతో తాండూరు పరిస్థితులపై ముచ్చటించారు. తాండూరు నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు తమవంతు తోడ్పాటు అందిస్తామని డీఎస్పీతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పూజారి పాండు, రామ్య నాయక్, చంద్రశేఖర్, విక్కీ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు మంతటి రాజు, పట్టణ కార్యదర్శి చిదిరి ప్రకాష్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు ప్రహ్లద్, బీజేవైయం పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, భాను యాదవ్ తదితరులు ఉన్నారు.
కింది వరకు పూర్తిగా చూడండి…


