తొడ‌గొట్టి స‌వాల్

తెలంగాణ రాజకీయం

తొడ‌గొట్టి స‌వాల్
– రేవంత్ పై మంత్రి మ‌ల్లారెడ్డి తిట్ల దండ‌కం
ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తొడగొట్టారు. టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డిపై తిట్ల దండ‌కం అందుకున్నారు. అరే గూట్లే..! అంటూ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లన్న తిట్ల దండకం అందుకున్నారు. ఇదే ఊపులో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తొడగొట్టారు. ఇద్ద‌రం రాజీనామా చేద్దాం.. ఎన్నికలకు పోదాం అంటూ రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.. ఎవరు గెలిస్తే వాళ్లే హీరో.. ఓడిపోతే జీరో అంటూ ఆవేశంతో ఊగిపోయారు.