చెన్ గేష్ పూర్ హనుమాన్ దేవాలయ ట్ర‌స్టుకు నోటిఫికేషన్

తాండూరు వికారాబాద్

చెన్ గేష్ పూర్ హనుమాన్ దేవాలయ ట్ర‌స్టుకు నోటిఫికేషన్
– దేవాల‌య ధర్మకర్తల మండలి భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మండలం చెన్ గేష్ పూర్ గ్రామంలోని హనుమాన్ దేవాలయ ధర్మకర్తల మండలి భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ మేరకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి భ‌ర్తికి దరఖాస్తుల ఆహ్వానాలను కోరుతున్నట్లు తెలిపారు. ధర్మకర్తల మండలి స్థానానికి నోటిఫికేషన్ జారిన రోజు నుంచి 20 రోజుల లోపు అభ్యర్థులు తమ దరఖాస్తులను దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి పంపవచ్చని సూచించారు. మరోవైపు గ్రామంలోని హనుమాన దేవాలయం ధర్మకర్తల మండలికి నోటిఫికేషన్ జారీ కావడంతో ఆశావాహులో సందడి మొదలైంది.