మందుబాబుకు షాక్..!
– తాగి వాహనం నడిపినందుకు జైలు శిక్ష
– జరిమాన కూడా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు
– వెల్లడించిన తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం సేవించి వాహనం నడిపి పోలీసు తనిఖీల్లో కేసు నమోదు అయిన మందుబాబుకు తాండూరు న్యాయస్థానం షాక్ ఇచ్చింది. వాహదానదారుడికి ఒక రోజు జైలు శిక్షతోపాటు జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించినట్లు తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణంలో ఇటీవల మద్యం సేవించి వాహనాలు నడిపించిన వారిపై జరిపిన తనిఖీల్లో పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన రవీందర్ అనే వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. శుక్రవారం తాండూరు న్యాయస్థానంలో స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నామాల అశోక్ కేసు పూర్వాపరాలను పరిశీలించి వాహనదారుడికి ఒక్కరోజు జైలు శిక్షతో పాటు రూ.1000ల జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ సందర్బంగా సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదికూడా చదవండి…

