ఎమ్మెల్యే కుమారున్ని అరెస్టు చేయాలి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యే కుమారున్ని అరెస్టు చేయాలి
– బీజేపీ నేత‌ల‌ను అరెస్టు చేసిన పోలీసులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: మైన‌ర్ బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డిన ఎమ్మెల్యే కుమారున్ని అరెస్టు చేయాల‌ని తాండూరు బీజేపీ నేత‌లు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలిక రేప్ సంఘ‌ట‌న‌ను నిర‌సిస్తూ సోమ‌వారం బీజేపీ, బీజేవైఎం ఆద్వ‌ర్యంలో ఆందోళ‌న‌, రాస్తారోకోకు పిలుపునిచ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తాండూరు పోలీసులు బీజేపీ నాయ‌కుల‌ను అరెస్టు చేశారు. బీజేపీ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి యు.ర‌మేష్ కుమార్‌తో పాటు నాయ‌కుల‌ను అరెస్టు చేసి పోలీస్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ జూబ్లిహిల్స్ మైన‌ర్ బాలిక‌పై ఎమ్మెల్యే కుమారుడు అత్యాచారానికి పాల్ప‌డితే అరెస్టు చేయ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. వెంట‌నే బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డిన ఎమ్మెల్యే కుమారుడు, నిందితుల‌ను అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. నాయ‌కుల‌ను అరెస్టు చేసినంత మాత్రాన ఉద్య‌మం ఆపేది లేద‌ని హెచ్చ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు సుద‌ర్శ‌న్ గౌడ్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దోమ‌కృష్ణ‌, సీనీయ‌ర్ నాయ‌కులు పూజారి పాండు, బీజేవైఎం నాయ‌కులు తాండ్ర‌న‌రేష్ త‌దిత‌రులు ఉన్నారు.