ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక
– అధ్యక్షులుగా రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నాగయ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం తాండూరు మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నికైంది. మంగళవారం తాండూరులోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో మండల శాఖ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రాంరెడ్డి, సంయుక్త అధ్యక్షులుగా చిగురు వీరేశం, ఉపాధ్యక్షులుగా అబ్దుల్ ఖాదర్, దివాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నాగయ్య, కార్యనిర్వహక కార్యదర్శులుగా డి.నాగిరెడ్డి, ప్రచార కార్యదర్శిగా టి.ప్రకాష్, కోశాధికారిగా కె.పద్మానాభారావు, జిల్లా కౌన్సిలర్లుగా బి.నర్సింలు, వెంకట్ స్వామి, డి.నాగభూషణం, హబీబ్ లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలలో ఎన్నికల అధికారిగా చెన్నారెడ్డి, పరిశీలకులుగా జూకా రెడ్డిలు వ్యవహరించారు. అనంతరం నూతన ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.


