మున్సిపల్ కమీషనర్‌గా శంకర్‌ సింగ్

తాండూరు రాజకీయం వికారాబాద్

మున్సిపల్ కమీషనర్‌గా శంకర్‌ సింగ్
– ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ
– తాండూరు కార్యాలయం తనీఖీ..?
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు మున్సిపల్ కమీషనర్‌గా శంకర్‌ సింగ్ నియామకం అయినట్లు సమాచారం. ఈ మేరకు మున్సిపల్ శాఖ నుంచి ఉత్తర్వులు కూడ వెలువడినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌ నగర్‌ కమీషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న శంకర్‌ సింగ్‌ను తాండూరు మున్సిపల్‌ కమీషనర్‌గా నియమించారు. తాండూరు మున్సిపల్‌లో దాదాపు మూడేళ్లుగా కమీషనర్‌ పోస్టు ఖాళీగా ఉంది. తాండూరు ఆర్డీఓ అశోక్‌ కుమార్ ఇంచార్జ్ కమీషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఖాళీగా ఉన్న కమీషనర్‌ పోస్టును భర్తీ చేసేందుకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. తాండూరు స్థానానికి ఇద్దరు అధికారులను నియమించినా వారు బాధ్యతలు తీసుకోవడానికి వెనుకడుగు వేశారు. తాజాగా మహబూబ్‌ నగర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్‌ శివశంకర్‌ను తాండూరు మున్సిపల్ కమీషనర్‌గా నియమించినట్లు అధికార వర్గాల సమాచారం. మరోవైపు ఆదివారం మున్సిపల్ కమీషనర్‌గా నియామకం అయిన కొత్త కమీషనర్‌ శివశంకర్ తాండూరు కార్యాలయాన్ని సందర్శించినట్లు తెలిసింది. ఇక్కడి పరిస్థితి, వ్యవహారాలను ఆరా తీసినట్లు సమాచారం. రేపో.. ఎల్లుండో.. శంకర్‌ సింగ్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.