పట్టణ ప్రగతితో సమస్యలకు చెక్
– మున్సిపల్ చైర్ పర్సన్ టీ.స్వప్న పరిమళ్
– 2,6వ వార్డులలో పర్యటించిన చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి: పట్టణ ప్రగతితో సమస్యలకు చెక్ పెట్టడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ టీ.స్వప్న పరిమళ్ పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు, 6వ వార్డులలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పర్యటించారు. పట్టణ ప్రగతి నాలుగో విడతలో భాగంగా వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరానగర్‌లో మురుగు కాలువ సమస్య ఉందని స్థానికులు చైర్ పర్సన్ దృష్టికి తీసుకవచ్చారు. అదేవిధంగా తాగునీటి పైపులైన్ సమస్య కూడ దృష్టికి రావడంతో వెంటనే వాటి పరిష్కారించేలా కృషి చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని స్వచ్చతకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు మధుబాల, బోయరవి, డీఈ రంగనాథం, పట్టణ ప్రగతి సూపర్ వైజర్ రమేష్, అధికారులు వెంకటేష్, నీరటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


