రేపు తాండూరులో పవర్ కట్
– అంతరాయం ఉండే ప్రాంతాలు ఇవే
– ప్రకటించిన విద్యుత్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం విధిస్తున్నట్లు విద్యుత్ శాఖ డీఈ భాను ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

సోమవారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. తాండూరు ఫీడర్ మరమ్మత్తుల కారణంగా పట్టణంలోని అన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదని, మరమ్మత్తుల అనంరతం విద్యుత్ పునరుద్ధరణ జరుగుతుందని చెప్పారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని సూచించారు.
ఇది కూడా చదవండి….

