సెలవుల పొడగింపు ఉండదు
– యధావిధిగా పాఠశాలల పునః ప్రారంభం
– క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభంపై విద్యాశాఖ మంత్రి స్పష్టత ఇచ్చారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యా సంస్థలు తెరుచుకోవడంలో ఆయోమయం నెలకొంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలు తెరుచుకోవడంపై అనుమానాలు నెలకొన్నాయి. 13వ తేదీ (సోమవారం) నుంచి విద్యాసంస్థలు ఓపెన్ కానుండటంతో పాఠశాలలకు సెలవులు పొడిగింపు ఉంటుందా..? లేదా..? అనే చర్చ నడుస్తోంది. కొన్ని రోజులు సెలవులు పొడిగించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ప్రైవేట్ స్కూళ్ల మాదిరి, ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధుల తల్లిదండ్రులు పదిరోజులకోసారి, టీచర్లను సంప్రదించి విద్యార్థుల చదువు, పురోగతిపై సంప్రదించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని, చాలా కాలం తర్వాత విజయవంతంగా స్కూళ్లను ప్రారంభిస్తున్నాం.. కాబట్టి ఎటువంటి ఆటంకం లేకుండా రేపు స్కూళ్ల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఉపాధ్యాయులకు ఈ మేరకు సూచించారు.
మరోవైపు మన ఊరు-మన బడికి సంబంధించి 9వేల స్కూళ్లలో వర్క్ జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ (1-8) మీడియం ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఒక నెలపాటు బ్రిడ్జికోర్సు నిర్వహించాలి. విద్యార్థుల సౌలభ్యం కోసం కోటి 64 లక్షల బైలింగ్వల్ బుక్స్ ప్రింట్ చేశారు.



