శివున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

తెలంగాణ

శివున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– భూకైలాస్, ఇత‌ర దేవాల‌యాల్లో పూజ‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులో జ‌రిగిన శివ‌రాత్రి ఉత్స‌వాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సంద‌డి చేశారు. మ‌హాశివరాత్రి సంద‌ర్భంగా తాండూరు మండ‌లం అంతారం తాండాలో వెల‌సిన భూకైలాస్ ద్వాద‌శ జ్యోతిర్లింగాల దేవ‌స్థానంలో వెల‌సిన శివునితో పాటు పట్టణంలోని భ‌ద్రేశ్వారాల‌యం, చెరువెంటి ఈశ్వారాల‌యం, కోటేశ్వ‌ర దేవాల‌యం, న‌గ‌రేశ్వ‌రాల‌యం, పోట్లీ మ‌హారాజ్ ఆల‌యంలో వెల‌సిన శివున్ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దర్శించుకున్నారు. అభిషేకం, పుష్పార్చ‌న‌ల‌తో ప‌ర‌మ శివుని సేవ‌లో త‌ర‌లించారు.
ఆయా దేవాలయాల్లో నిర్వ‌హ‌కులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని శాలువాల‌తో స‌న్మానించారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు డాక్ట‌ర్ సంప‌త్ కుమార్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాసాచారి, రాజుగౌడ్, తాండూరు మండల అధ్యక్షులు రాందాస్, తాండూరు పట్టణ ఉపాధ్యక్షులు హరిగౌడ్, ఎంపీటీసీ సాయి రెడ్డి, ఆయా దేవాలయాల ప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.