రేపే రాజీవ్ స్వగృహ ప్లాట్లకు బహిరంగ వేలం
– 71 ప్లాట్ల వేలానికి ఏర్పాట్లు పూర్తి
– త్వరపడండి అంటున్న అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు – హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ స్వగృహ కాలనీలో మిగిలిపోయిన ప్లాట్లకు రేపే వేలం వేయబోతున్నారు. యాలాల మండలం కోకట్ గ్రామ పరిధి సర్వే నంబర్ 52 నందు దు మోహ టౌన్షిప్ లో మిగిలిపోయిన ప్లాట్లకు ప్రభుత్వం తరుపున అధికారులు ఈ వేలం పాట నిర్వహిస్తున్నారు. స్వగృహాలోని 71 ఫ్లాట్లకు వేలం వేస్తుండగా. ఇందులో 55 సెమీ ఫినిష్‌డ్, 16 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. 250 గజాలకు సంబంధించి 15 ప్లాట్లు, 200 గజాలకు సంబంధించి 9 ప్లాట్లు, 150 గజాలకు సంబంధించి(అసంపూర్తిగా) 10 ప్లాట్లు, 100 గజాలకు సంబందించి 31 ప్లాట్లు ఉన్నాయని తెలిపారు. వేలంలో పాల్గొనాల్సిన వారు రూ. 10 వేల డీడీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. వేలంలో ప్లాట్లు దక్కించుకుంటే వారం రోజుల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. త్వరపడి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేలంలో ప్లాట్లు దక్కించుకున్న లబ్దిదారులకు పకడ్బందీగా రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుందని ఇటీవలే తాండూరులో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అంతేకాకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలతో పాటు రోడ్లు, విద్యుత్తు, నీటి సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు.



