కాంప్లెక్స్ దుకాణాలు వక్స్ బోర్డు చెందినవే
– ఈద్గా, స్మశాన వాటికలు వాటి పరిధిలోనే
-ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కాంప్లెక్స్ దుకాణాలు వక్స్ బోర్డుకు చెందినవని అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం అడ్మినిస్ట్రేషన్ అధ్యక్షులు ఖుర్షీద్ హుస్సేన్, కార్యదర్శి హాది ష హేరీ, కోశాధికారి గోల్కొండ సత్తార్ లు సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని సర్వే నెంబర్ 109, 110లలో ఉన్న ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కు దాదాపు 7ఎకరాల 18 గుంటల భూములు ఉన్నాయన్నారు. ప్రస్తుత ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పరిధిలో ఉన్న 51 దుకాణాలు వక్స్ బోర్డుకు చెందుతాయన్నారు.
1997 నుంచి 2007, 2009, 2014 యేడాదిలో వివిధ దశల్లో వర్ఫ్ బోర్డు కమిటీ ఆధ్వర్యంలోనే ఈ సర్వే నెంబర్ లో నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. అప్పట్లో తామూ అధ్యక్ష, కార్యదర్శులుగా వ్యవహరించినట్లు వెల్లడించారు. దుకాణాల నిర్మాణాలకు మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలు నిధులు కూడా అందించారని గుర్తుచేశారు. మొదట 15 దుకాణాలు నిర్మించగా క్రమంగా 51 దుకాణాలుగా మారిందన్నారు. 15 దుకాణాల అసెస్ మెంట్ జరిగిందని, మిగతా దుకాణాల అసెస్ మెంట్ జరగలేదన్నారు. ఇందుకు తగిన ఆధారాలు మావద్ద ఉన్నాయన్నారు.
అయితే కొన్నాళ్ల క్రితం ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని సభ్యులు దుకాణాలపై అజమాయిషీ సాగిస్తున్నారని ఆరోపించారు. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దుకాణాలన్ని వక్స్ బోర్డుకే చెందుతాయన్నారు. ఈద్గా స్థలంతో పాటు స్మశాన వాటికలు కూడా వక్స్ బోర్డుకు సంబంధించినవే అని అన్నారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులుగా చెప్పుకుంటున్న నేతలు స్వచ్చంధంగా దుకాణాలను వక్స్ బోర్డుకు అందించాలని కోరారు. పేద ముస్లిం అభివృద్ధి కోసం కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి…

