ప్రభుత్వ స్థలాలను పరిరక్షించండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రభుత్వ స్థలాలను పరిరక్షించండి..!
– ఆర్డీఓకు విన్నవించిన కౌన్సిల‌ర్ సోమ శేఖర్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని ఆర్డీఓ, ఇంచార్జ్ కమిషనర్ అశోక్ కుమార్ ను తెలంగాణ జన స‌మితి తాండూరు ఇంచార్జ్, కౌన్సిలర్ సోమశేఖర్ కోరారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ వార్డులోని ఓ ఖాళీ స్థలంలో గతంలో ఉన్న మూత్రశాలలను కూల్చివేయగా దానిపై కొందరు దొంగ పత్రాలు సృష్టించి కబ్జాకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా రాచన్న గుడి వెనుక బిచ్చప్ప ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలానికి కంచె ఏర్పాటు చేయాలని, అట్టి స్థలాన్ని వార్డు ప్రజలకు ఉపయోగ పడే విధంగా చొరవ చూపాలని వినతిపత్రం ద్వారా కోరారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీన్నిపై ఆర్డీఓ అశోక్ కుమార్ సానుకూలంగా స్పందించినట్లు సోమశేఖర్ తెలిపారు.