ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలి
– ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను పరీక్షలు రద్దు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ)వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పి .శ్రీనివాస్ అన్నారు. సోమవారం తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత 18 నెలలుగా కరొన తీవ్ర రూపంలో విజృంభించడంతో విద్యా సంస్థలు మూతపడ్డాయని తెలిపారు. దీంతో 2019-20 విద్యా సంవత్సరం విద్యార్థుల ప్రమోట్ చేసిన ప్రభుత్వం 2021 విద్యా సంవత్సరం కూడా పదో తరగతి ,ఇంటర్ విద్యార్థులకు ప్రమోట్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకుని కార్పొరేట్ కళాశాలల కోసం పరీక్షలకు సిద్ధమవుతుందని విమర్శించారు. ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో 1700 గెస్ట్ లెక్చరర్ పోస్టులు రెన్యువల్ చేయకపోడంతో పాటు ఆన్‌లైన్ తరగతులు కూడ నిర్వహించలేదన్నారు. ఈనెల 25 నుంచి పరీక్షలు పెడతానని ఇంటర్ బోర్డు మొండిగా ముందుకు పోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు ప్రకాష్, మహేష్, విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు.
