బక్రీద్‌కు అన్ని ఏర్పాట్లు

తాండూరు రాజకీయం వికారాబాద్

బక్రీద్‌కు అన్ని ఏర్పాట్లు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఈద్గా మైదానాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ముస్లిం పండుగ బక్రీద్‌కు అన్ని ఏర్పాట్లు కల్పిచేంలా చూస్తామని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. బక్రీద్ పండుగను పురస్కించుకుని బుధవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నేతలు, ముస్లిం మత పెద్దలతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణం చెన్ గేష్ పూర్ రోడ్డు మార్గంలో ఉన్న ఈద్గా మైదానాన్ని సందర్శించారు. బక్రీద్ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసే ప్రార్థన ఏర్పాట్ల గురించి మత పెద్దలతో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బక్రీద్ సందర్భంగా ఈద్గా మైదానంలో అన్ని ఏర్పాట్లు చేయిస్తామని అన్నారు. పోలీసు, మున్సిపల్, రెవెన్యూ తదితర శాఖల సమన్వయంతో అన్ని సౌకర్యాలను కల్పించేలా చేస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజుగౌడ్, పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, ఈద్గా చైర్మన్ యూసుఫ్ ఖాన్, మైనార్టీ నాయకులు, యువకులు తదితరులు ఉన్నారు.

పరిశీలించిన మున్సిపల్ అధికారులు
మరోవైపు బక్రీద్ సందర్భంగా మున్సిపల్ అధికారులు ఈద్గా మైదానాన్ని పరిశీలించారు.

మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి ఆ శాఖ తరుపున కల్పించే ఏర్పాట్లపై ఈద్గా ప్రతినిధులతో చర్చించారు. మైదానంలో పారిశుధ్య పనులు, ప్రార్థనలకు ఏర్పాట్లు తదితర పనులను సమీక్షించారు. ఈద్గా మైదానం వద్ద అన్ని ఏర్పాట్లను చేయాలని జవాన్లకు సూచించారు.