విధుల్లో నిర్లక్ష్యం వహించరాదు

తాండూరు రాజకీయం వికారాబాద్

విధుల్లో నిర్లక్ష్యం వహించరాదు
– ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రద్ధచూపాలి
– తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి
తాండూరు, దర్శిని ప్రతినిధి : విధుల్లో జవాబుదారితనంతో పనిచేయాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి అన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ యాదగిరి ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ తదితర విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.
kvcs
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. శానిటేషన్, అక్రమ నిర్మాణాలు, తాగునీరు, విద్యుత్ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు దృష్టిసారించాలన్నారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. ప్రజలకు జవాబుదారి తనంతో.. వారి సమస్యలను పరిష్కరించేందుకు శ్రద్ధ చూపాలన్నారు.

వార్డు ఆఫీసర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని, ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ మణిపాల్, ఏఈ ఖాజా హుస్సేన్, ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కట్ట మైసమ్మ.. కృప మెండుగా ఉండాలి..!