పోలీసుల పట్ల ప్రజాభిమానం అభినందనీయం
– శాంతిభద్రతలకు ముస్లిం వెల్ఫేర్ తోడ్పాటు మరువలేనిది
– ఆత్మీయ సమ్మేళనంలో తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీసుల పట్ల ప్రజలకు ఉన్న అభిమానాలు అభినందనీయమని తాండూరు డీఎస్సీ జీ.శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీఎస్సీ జి. శేఖర్ గౌడ్ ను, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ ఐలను ఆసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఇక్కడి ప్రజలు పోలీసులతో స్నేహభావంగా మెలగడం సంతోషంగా ఉందన్నారు. పోలీసుల పట్ల ప్రజల అభిమానం అభినందనీయమన్నారు. అదేవిధంగా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు. తాండూరులో అల్లర్లు చెలరేగకుండా, ఆందోళనలు జరగకుండా ముస్లిం వెల్పేర్ తోడ్పాటు అందిస్తూ పోలీసులపై ఒత్తిడిని తగ్గిస్తున్నారని పేర్కొన్నారు. వారి సేవలు మరువలేనివన్నారు. ఇక ముందు కూడ మరిన్ని సేవా కార్యక్రమాలను, యువత అభివృద్ధికి చేయూతనందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బాబర్, కార్యదర్శి ఉస్మానియా గని, ఉపాధ్యక్షులు షల్లో, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, అడ్వయిజర్ కమిటీ అధ్యక్షులు ఖుర్షిద్ హుస్సేన్, హాది, అబ్దుల్ సలీం తదితరులు పాల్గొన్నారు.


