వ‌ర్షానికి కూలిన దేవుని గుడి గోడ‌

తాండూరు వికారాబాద్

వ‌ర్షానికి కూలిన దేవుని గుడి గోడ‌
– పెద్దేముల్ మండ‌లం గాజీపూర్‌లో ఘ‌ట‌న
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాలతో ప్ర‌జ‌లు కాస్త ఇబ్బందులు ప‌డుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని పెద్దేముల్ మండ‌లంలో ఓ దేవుని గుడి గోడ కూలిపోయింది. మండ‌లంలోని గాజీపూర్ గ్రామంలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం గోడ శిథిలావ‌స్థ‌కు చేరుకుంది. రెండు రోజులుగా ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో దేవాల‌యం వెనుక‌భాగంలోని గోడ పూర్తిగా త‌డిసిపోయింది. శ‌నివారం రాత్రి త‌డిసిపోయిన గోడ పాక్షికంగా కూలిపోయింది. ఈ సంఘ‌ట‌న గ్రామ‌స్తులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు.