అనంత పద్మనాభుడికి పట్టు వస్త్రాలు..!
– ముడుపు చెల్లించిన మనోహర్ రెడ్డి
– స్వామికి పూజలు చేసిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంత పద్మనాభ స్వామికి తాండూరు ఎమ్మేల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముడుపు చెల్లించారు.తాండూరు శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో నిలిచి గెలిచిన సందర్భంగా మొక్కు తీర్చుకున్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రం లోని ఆలంపల్లి శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంను బుయ్యని మనోహర్ రెడ్డి సందర్శించారు. ఆలయంలో వెలసిన స్వామి దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. ఈ సదర్భంగా ఎమ్మేల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపించిన తాండూరు నియోజక వర్గ అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు. ఎమ్మేల్యే వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిని నారాయణ రెడ్డి, సాయిని శ్రీనివాస్ రెడ్డి, నర్సిములు, భాస్కర్ రెడ్డి, గంగాధర్ గౌడ్, తాండూరు నాయకులు మాజీ డీపీసీ సభ్యులు పట్లోల్ల నర్సింలు, సాయిపుర్ బాల్ రెడ్డి, మంబాపుర్ నారాయణ రెడ్డి తదతరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

