సద్దుల పూల పల్లకిలో..
– అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
– సాయిపూర్‌లో అట్టహాసంగా వేడుకలు
– పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి, మాతృమూర్తి
– తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: దారంతా పూలపల్లకిలా.. తాండూరులో సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. బతుకమ్మ పండగ వైభోగమంతా పట్టణంలోని సాయిపూర్‌లో తాండవించింది. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో వారి వార్డులో బతుకమ్మ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.
తీరొక్క పూలతో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ దీపా నర్సింలు, మాజీ కౌన్సిలర్ సావిత్రమ్మలతో పాటు కూతుళ్లు బతుకమ్మలను మోసుకొచ్చారు. బతుకమ్మను మద్యలో ఉంచి చూట్టూరా తిరుగుతు బతుకమ్మ ఆట పాటలను హోరెత్తించారు.
ఆకట్టుకున్న ఎమ్మెల్యే సతీమణి
సాయిపూర్‌లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో తాండూరు ఎమ్మెల్యే తల్లి, వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, సతీమణీ ఆర్తీరెడ్డిలు పాల్పంచున్నారు. వారితో పాటు తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితాసంపత్ కూడ పాల్గొన్నారు. వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలుతో ఎమ్మెల్యే తల్లీ ప్రమోదిని రెడ్డి, సతీమణి ఆర్తీరెడ్డి, సునితాసంపత్‌లు మహిళలతో బతుకమ్మ ఆటలాడారు.
అనంతరం చేపట్టిన ఊరేగింపులో ఎమ్మెల్యే సతీమణి బతుకమ్మును ఎత్తుకుని ముందుకుసాగారు. శోభాయామానంగా సాగిన ఊరేగింపులో ఎమ్మెల్యే సతీమణి ఆర్తీరెడ్డి ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.
తరలివచ్చిన నాయకులు
మరోవైపు సాయిపూర్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు రాజుగౌడ్, తాండూరు మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, నేతలు పాల్గొన్నారు.
వీధుల గుండా సాగిన ఊరేగింపులో బతుకమ్మలను మోస్తూ ముందుకు సాగి సందడి చేశారు. పూల దివిటీలు, విద్యుత్ కాంతులలో సద్దుల బతుకమ్మ వేడుక పూల పల్లకిలా కొనసాగింది.