అరచేతిలో పిడుగు సమాచారం
– అందుబాటులో ప్రత్యేక యాప్లు
– వర్షాన్ని గుర్తించే యాపులు కూడ
దర్శిని డెస్క్: వర్షాకాలంలో ఒకప్పుడు అతి వర్షాలు, భారీ వర్షాలు ఎప్పుడు పడతాయని అనేది తెలుసుకోవడం కష్టమైన పనే. శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కిన తరువాత వర్షాలు ఎప్పుడు పడాతయని, ఎంత మోతాదులో పడ్డాయి. అనే విషయాలను గుర్తిస్తున్నారు. తాజాగా స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ రంగాలు మరింత పురోవృద్ధి సాధించాక వర్షాలు ఎప్పుడు పడతాయనే విషయాలతో పాటు ఎంత దూరంలో పడతాయనే విషయాలను కూడ గుర్తించడం జరుగుతున్నాయి. అయితే వర్షాలతో పాటు పిడుగు పాటు ప్రమాదాలను గుర్తించే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అది కూడ మనం వినియోగించే అరచేతి స్మార్ట్ ఫోన్లో గుర్తించడం జరుగుతుంది. ఇందుకోసం యాప్లు కూడ అందుబాటులోకి వచ్చాయి. అవేంటో తెలుసుకోంది.
పిడుగు సమాచారం అందించే వజ్రపాత్

గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అంతర్జాలం అనుసంధించాక ఈ యాప్ గుర్తుపై నొక్కాలి. రెండు రకాల సమాచారం వస్తుంది. ఎడమ వైపు పిడుగు గుర్తు, పిడుగు సమాచారం కనిపిస్తుంది. అక్కడ నొక్కితే మనం ఉన్న ప్రాంతం సహా చిత్రపటం కనిపిస్తుంది, ఎరుపు, నారింజ పసుపు రంగుల్లో వలయాలు కనిపిస్తాయి వీటి పక్కనే 8, 15, 30 అంకెలుంటాయి, అంటే కొద్ది సేపట్లో అంత దూరంలో(కిలో మీటర్లలో) పిడుగు పడే అవకాశం ఉందని గుర్తు. అలాంటిదేమీ లేకపోతే మీ సమీపంలో పిడుగుపడే అవకాశం లేదని సమాచారం కనిపిస్తుంది. ఎంత దూరంలో పిడుగుపడే అవకాశం ఉందో కూడా పిన్ రూపంలో కనిపిస్తుంది. దీంతో ముందస్తుగా అప్రమత్తం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు
దామిని యాప్లో కూడ
గూగుల్ ప్లేస్టోర్స్ నుంచి దామిని యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. దీని సహాయంతో సమీపంలోని 20 కి.మీ పరిధిలో ఐదు నుంచి 20 నిమిషాల వ్యవధిలో ఎక్కడ పిడుగు పడే అవకాశం ఉందో అప్రమత్తం చేస్తుంది. పిడుగుపడే లోపు ఈ యాప్ ఉన్న వ్యక్తి తనతో పాటు సమీపంలో ఉన్న వారిని రక్షిత ప్రాంతాలకు వెళ్లేలా అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది.
రేయిన్ అలారంతో వర్షం రాక గుర్తింపు
గూగుల్ ప్లేస్టోర్ నుంచి రెయిన్ అలారం యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వినియోగదారుడు అందించిన సమాచారం మేరకు ఆయన ఉండే ప్రాంతానికి సమీపంలోని 20 కి.మీ పరిధిలో ఎక్కడ వర్షం పడే సూచనలున్నాయో క్షణాల్లో తెలుసుకోవచ్చు. వర్షం ముప్పును గురించి ముందే తెలుసుకుని జాగ్రత్త పడే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

