భళా.. బుయ్యని..!
– పంచాయతీల హస్తగతంపై హర్షం
– తాండూరు ఎమ్మెల్యేకు ఏఐసీసీ ఇంచార్జీ అభినందన
తాండూరు దర్శిని ప్రతినిధి : ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని అభినందించారు.

బుధవారం మీనాక్షి నటరాజన్ ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో తొలి విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులను అత్యదిక స్థానాల్లో గెలిపించుకోవడంతో పాటు, నియోజకవర్గంలో 25 పంచాయతీలను ఏకగ్రీవం చేయడం పట్ల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని అభినందించారు.

అదేవిధంగా పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. రానున్న ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలపై కూడా చర్చించు కున్నారు. మరోవైపు ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తనకు అభినందనలు తెలపడంపై ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

