భళా.. టీఆర్ఎస్ యూత్..!
– పాత తాండూరు రోడ్డుకు మరమ్మత్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు వెళ్లే రోడ్డు మార్గానికి స్థానిక టీఆర్ఎస్ యువనాయకులు మరమ్మత్తులు చేయించారు. గతంలో ఈ మార్గంలో చేపట్టిన మిషన్ భగీరథ పనుల కారణంగా రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. ఇదివరకు వేసిన మట్టిపై ఇటీవల కురుస్తున్న వర్షాలతో దెబ్బతింది. దీంతో రోడ్డుపై వర్షపు నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక టీఆర్ఎస్ యువనాయకులు నీరటి హన్మంతు, అబ్రార్ లాల, ఇమ్ము తదితరులు జేసీబీ యంత్రంతో రోడ్డుపై గుంతలను పూడ్చే పనులు చేపట్టారు. రోబో శ్యాండ్ వేయించి ఇబ్బందులను పరిష్కరించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.




