అక్రమ కేసులకు భయపడేదిలేదు..!
– ఎన్ఎస్ఈయూఐ నాయకులపై కేసులేవి
– బీఆర్ఎస్వీ తాండూరు అధ్యక్షులు సందీప్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీసులు ఎన్ని అక్రమ కేసులు నమోదు చేసినా భయపడేది లేదని బీఆర్ఎస్వీ తాండూరు పట్టణ అధ్యక్షులు పట్లోళ్ల సందీప్ రెడ్డి అన్నారు. గత నెల బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు తాండూరు పట్టణంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చె సిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో సందీప్ రెడ్డి, రజక నర్సింహా, ఇబ్రహీం, వినోద్ తదితరులపై తాండూరు పట్టణ పోలీస్టేషన్లో బీఎన్ఎన్ఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేయడంతో గురువారం పోలీస్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శుక్రవారం సందీప్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపినందుకు కేసులు నమోదు చేశారని అన్నారు. పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసినా భయపడేది లేదన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షానా ఎన్ని పొరాటాలైనా చేస్తామన్నారు. అదేవిధంగా నీట్ పేపర్ విషయంలో ఎన్ఎస్ యూఐ నాయకులు ప్రధాని నరేంద్రమోడి దిష్టిబొమ్మను దహనం చేస్తే ఆ నాయకులపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.
ఇదికూడా చదవండి…

