కిడ్నిలను కాపాడుకుందాం
– జాగ్రత్తలు పాటిస్తే పదిలం
దర్శని డెస్క్ : మనిషి ఆరోగ్యంగా ఉండాడానికి ఆరోగ్యకరమైన కిడ్నీ కలిగి ఉండటం చాలా అవసరం. కిడ్నీ మన శరీరంలోని ఒక ముఖ్యమైన భాగం, ఇది మూత్రం ద్వారా శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. కిడ్నీ మన శరీరంలోని నీరు, ఉప్పు, ఖనిజాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మారుతున్న జీవన శైలి విధానాల వల్ల ఎంతో మంది కిడ్ని సమస్యల బారిన పడుతున్నారు. ప్రతి 7 మందిలో ఒకరు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నారని ఒక సర్వేలో తేలింది. అధిక రక్తపోటు, చక్కెర ఈ వ్యాధికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
కిడ్నీ ఫెయిల్యూర్‌కి ప్రధాన కారణాలు
కిడ్నీ ఫెయిల్యూర్‌కు ప్రధాన కారణం సరైన ఆహారపు అలవాట్లు, చెడు అలవాట్లు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అనేది ఒక వ్యక్తికి రెండు కిడ్నీలు పనిచేయడం మానేసే పరిస్థితి. అంతేకాకుండా శరీరంలో ప్రమాదకరమైన బాక్టీరియా వృద్ధి చెందడం వల్ల వచ్చే కిడ్నీ వ్యాధి, మందులు ఎక్కువగా తీసుకోవడం, శారీరక గాయాలు, వ్యాధులు లేదా ఇతర రుగ్మతల వల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటాయి. మీరు కిడ్నీ వైఫల్యాన్ని నివారించాలనుకుంటే, ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోండి. కిడ్నీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంది.
ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం పదిలం
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఆహారంలో నూనె, ఉప్పు, మసాలాలు తీసుకోవడం తగ్గించండి. శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి. శరీరాన్ని చురుకుగా ఉంచడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోండి. నీరు లేకపోవడం వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. డ్రగ్స్, ఆల్కహాల్ వాడటం మానేయండి. మాదకద్రవ్యాల వినియోగం మూత్రపిండాల సమస్యలను పెంచుతుంది. చిన్న చిన్న జబ్బులకు పెయిన్ కిల్లర్స్ వాడవద్దు. మందులు ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీలు పాడవుతాయి. బరువును నియంత్రించుకోండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)



