జిల్లాలో స‌ద‌రం క్యాంపు తేదిల ఖ‌రారు

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

జిల్లాలో స‌ద‌రం క్యాంపు తేదిల ఖ‌రారు
– 21 నుంచి సెప్టెంబ‌ర్ 29 వ‌ర‌కు క్యాంపులు
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లాలో నిర్వహించే స‌ద‌రం క్యాంపు షెడ్యూల్‌ను అధికారులు ఖ‌రారు. ఇందుకు సంబంధించిన తేదిల‌ను కూడ ప్ర‌క‌టించారు. ఈనెల 21 నుంచి సెప్టెంబ‌ర్ 29 వ‌ర‌కు జిల్లాలోని వివిధ ఆసుప‌త్రుల‌లో ఏర్పాటు చేసిన క్యాంపు వివ‌రాల‌ను ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. 21న తాండూరు ప్ర‌భుత్వ జిల్లా ఆసుప‌త్రి, 27న సీహెచ్‌సీ వికారాబాద్ ఆసుప‌త్రి, వ‌చ్చే నెల 4న తాండూరు జిల్లా ఆసుప‌త్రి, వ‌చ్చే నెల 10,18న సీహెచ్‌సీ వికారాబాద్ ఆసుప‌త్రి, వ‌చ్చేనెల 25న తాండూరు ప్ర‌భుత్వ జిల్లా ఆస‌ప‌త్రి, సెప్టెంబ‌ర్ 8న సీహెచ్‌సీ వికారాబాద్ ఆసుప‌త్రి, సెప్టెంబ‌ర్ 15న తాండూరు ప్ర‌భుత్వ జిల్లా ఆసుప‌త్రి, సెప్టెంబ‌ర్ 22న సీహెచ్‌సీ వికారాబాద్ ఆసుప‌త్రి, సెప్టెంబ‌ర్ 29న తాండూరు ప్ర‌భుత్వ జిల్లా ఆసుప‌త్రిలో ఈ క్యాంపుకు కొన‌సాగుతాయ‌ని వెల్ల‌డించారు.

ఏయే వైక‌ల్యానికి ప‌రిక్ష‌లు నిర్వ‌హిస్తారో కింది జాబితాను ప‌రిశీలించండి