కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిపై భగ్గుమన్న బీజేపీ

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిపై భగ్గుమన్న బీజేపీ
– చర్యలు తీసుకోవాలని పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేపై తాండూరు బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గురువారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మతవిద్వేషాలను రెచ్చగొడుతూ దేశంలో మతకల్లోలాలను సృష్టించే విధంగా సభాముఖంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేయడం తగదని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీని ఉద్దేశించి మల్లికార్జున ఖర్గే వాఖ్యలు చేయడం పట్ల భగ్గుమన్నారు. కావునపై ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, రాష్ట్ర మహిళా మూర్ఛ నాయకులు సాహు శ్రీలత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, కౌన్సిలర్లు అంతారం కిరణ్ కుమార్, డి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బండారు శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి మంతటి రాజు, ఉపాధ్యక్షులు దోమ కృష్ణ, కందనెల్లి సంగమేశ్వర్, ఇందూర్ రాములు, మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షుడు షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

మెరిసిన మొయిజ్..!