వ‌చ్చెనెల‌లోనే ఎస్ఐ ప్రిలిమిన‌రీ ఎగ్జామ్ రిజ‌ల్ట్

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

వ‌చ్చెనెల‌లోనే ఎస్ఐ ప్రిలిమిన‌రీ ఎగ్జామ్ రిజ‌ల్ట్
– అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్న‌ రిక్రూట్‌మెంట్ బోర్డు
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: పోలీసు శాఖ‌లో ఖాళీల‌ను భ‌ర్తి చేసేందుకు ప్ర‌భుత్వం ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు నోటీఫికేష‌న్ వేసింది. దాదాపు 17వేలకు పైగా పోస్టులను భ‌ర్తి చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ పోస్టుల‌కు 2ల‌క్ష‌ల‌కు పైగా అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈనెల 7న 538 పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇక ఈనెల 28న జ‌రిగే కానిస్టేబుల్ పోస్టుల‌కు ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ల‌కు అభ్య‌ర్థులు సిద్ద‌మ‌వుతున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఈ రోజు (ఆగస్టు 18న) విడుదల చేసింది. అయితే ఎస్‌ఐ ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధిచిన ఫలితాలు సెప్టెంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. ఐతే దీనిపై పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారికంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయి.