కాంగ్రెస్ సంక్షేమం… నిరంతరం..!
– అర్హులందరికి అమలు చేయడమే లక్ష్యం
– రెచ్చగొట్టే నేతల మాటలు నమ్మొద్దు
– తాండూరు అభివృద్ధికి భారీ ప్రణాళికలు
– చిలుకవాగు, అండర్ డ్రైనేజీలతో కొత్త మహర్దశ
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ హాయంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను నిరంతరం’ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన వార్డు సభలు చివరి రోజు పట్టణంలో అట్టహాసంగా జరిగాయి. శుక్రవారం పట్టణంలోని 33వ వార్డులో బసవణ్ణ కట్ట వద్ద ఏర్పాటు చేసిన వార్డు సహకు ఎమ్మెల్యే మనోహజ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్ పరస్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ గౌడ్, పార్టీ నేతలతో కలిసి వార్డు సభలో లబ్దిదారులు నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. పేదలకు ఇండ్లు, రేషన్ కార్డులు అందజేయని ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎన్నికల్లో హామి ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేసేందుకు దృష్టిసారిస్తుందన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు. రైతులకు రైతు భరోసా, కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈనెల 26నుంచి కొత్త సంక్షేమ పథకాలను అందించబోతుందని అన్నారు. కొత్త పథకాల అమలుపై పనికిమాలిన రాజకీయాలు చేసే నేతల మాటలు నమ్మొద్దన్నారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను నిరంతరం అమలు చేసే బాధ్యత తీసుకుందన్నారు.
పథకాల జాబితాలో పేర్లు రాకుంటే పరేషాన్ కావొద్దని, మళ్లీ దరఖాస్తులు అందించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అమలు చేస్తామన్నారు. అదేవిధంగా తాండూరు మున్సిపల్లో గత ఐదేళ్లుగా కుంటు పడిన అభివృద్ధిని వేగం పెంచడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా చిలుకవాగు అభివృద్ధికి రూ.16 కోట్లు కేటాయించగా.. ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. దీంతో పాటు పట్టణంలో తాండూరు పట్ణంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థకు రూ.500ల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని. ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో పనులు చేపట్టేందుకు కృషి చె స్తామన్నారు. రూ.30 కోట్లతో గొల్లచెరువు అభివృద్ధితో పాటు అమృత్2.0 ద్వారా ఇంటింటికి తాగునీరు అందించే పనులు చేపట్టబోతున్నామన్నారు.
సీసీ రోడ్డు, డ్రైన్ పనులకు శంకుస్థాపన
మరోవైపు తాండూరు పట్టణం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కు చెందిన 27వ వార్డులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 9లక్షలతో చేపడతున్న సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, పి.బస్వరాజ్, సర్దార్ ఖాన్, కౌన్సిలర్లు విజయదేవి, అబ్దుల్ రజాక్, ప్రభాకర్ గౌడ్, బొంబీనా, వెంకన్నగౌడ్, బోయరవి, భీంసింగ్, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, మాజీ కౌన్సిలర్లు పరిమళ రవీందర్. జుబేర్ పాష, శ్రీనివాస్, భద్రేశ్వరాలయ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, నాయకులు వడ్డె శ్రీనివాస్, బంటు మల్లప్ప, బంటు వేణుగోపాల్, రాము, మహిళ నాయకురాలు సౌజన్య, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, వార్డు ఆఫీసర్లు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

