అర్హులకే పేదలకు డబుల్ బెడ్ రూంలు పంపిణీ చేయాలి
– అక్రమ నిర్మాణాలు, వీధి కుక్కల సమస్యలు పరిష్కరించాలి
– జిల్లా కలెక్టర్ కు బీజేపీ కౌన్సిలర్ సాహు శ్రీలత వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూం పంపిణీలో అర్హులకే అందేలా చూడాలని తాండూరు బీజేపీ 24వ వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత కోరారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి పలు అంశాలపై వినతిపత్రాలను అందజేశారు. తాండూరు పట్టణంలోని శివాజీ చౌరస్తాలో ఓ వ్యక్తి రోడ్డు ఆక్రమించుకుని కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాటు తాండూరులో వీధి కుక్కల బెడద పెరిగిపోయిందని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తాండూరులో అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూం పథకాలలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూంలు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళ నాయకులు, మహిళ మోర్చ నాయకులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

